![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. అయితే తన ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూశారు. నెగెటివ్ టాక్ తో హౌస్ లోకి వెళ్ళిన రమ్య అంతే నెగెటివ్ తో బయటకొచ్చేసింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా వచ్చిన రమ్య మోక్ష సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమెకు వారానికి రెండు నుండి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఆమె రెండు వారాలు హౌస్‌లో ఉన్నందుకు గానూ తను నాలుగు నుండి ఆరు లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఇది చాలా ఎక్కువ అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో ఎవరితోను బాండింగ్స్ పెట్టుకోకూడదని సింగిల్ ఎజెండాతో వెళ్ళి, హౌస్ లో ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ గా గేమ్స్ ఆడి, చివరికి సింగిల్ గా బయటకొచ్చేసింది. ఆయితే రమ్య మోక్ష ఫస్ట్ వీక్ ఏ బయటకొచ్చేసేది కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని ఫస్ట్ వీక్ నుండి సేవ్ చేసాడు బిగ్ బాస్. వారికి ఉన్న స్పెషల్ పవర్స్ వల్ల వారు హౌస్ లో సర్వైవ్ అవుతున్నారు లేదంటే అందరు నామినేషన్లోకి వచ్చేవారు.
హౌస్ లో మాధురితో ఎక్కువగా ఉన్న రమ్య మోక్ష.. తన నుండి బాండింగ్(బంధం) కోరుకుంది. కానీ మాధురి తనకు దూరంగా ఉండి తనూజకి దగ్గరైంది. అలా మాధురి తనతో ఉండకుండా తనూజకి దగ్గరగా ఉండటం తీసుకోలేకపోయింది. చివరికి తనూజని నామినేట్ చేసి.. చెత్త రీజన్లు చెప్పి అందరి దృష్టిలో బ్యాడ్ అయింది. ఇక ఆడియన్స్ ఎవరు కూడా రమ్య మోక్షకి ఓట్లు వేయలేదు ఎందుకంటే హౌస్ లో శ్రీనివాస్ సాయి పెద్దగా ఆడట్లేదు. అతని వల్ల కంటెంట్ కూడా ఏం లేదు.. అతనే ఎలిమినేషన్ అవ్వాల్సింది కానీ నెగెటివ్ టాక్ ఎక్కువగా తెచ్చుకున్న రమ్య మోక్ష మరింత నెగెటివ్ తెచ్చుకొని ఆడియన్స్ ఓటింగ్ లేక బయటకొచ్చేసింది.
![]() |
![]() |